టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

జగన్ ఆస్తుల కేసులు.. ఎన్నికల లోపు పూర్తీ చేయాలంటూ!!టాప్ లో హైదరాబాద్.. ఆనందంలో కేటీఆర్

Update: 2023-12-15 12:57 GMT

latest telugu news

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

జగన్ ఆస్తుల కేసులు.. ఎన్నికల లోపు పూర్తీ చేయాలంటూ!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. మాజీ ఎంపీ హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇప్పటికే వైఎస్ జగన్ కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

టాప్ లో హైదరాబాద్.. ఆనందంలో కేటీఆర్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో రికార్డును అందుకుంది. ఉత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ప్రపంచ నగరాల ర్యాంకింగ్స్‌ లో భాగంగా దేశంలోనే బెస్ట్ సిటీగా మన హైదరాబాద్ నిలిచింది. పుణే, బెంగళూరు లాంటి ఐటీ నగరాలను వెనక్కి నెట్టి అత్యుత్తమ నగరంగా నిలిచింది. హైదరాబాద్‌ బెస్ట్‌ సిటీగా నిలవడం 2015 నుంచి ఇది ఆరోసారి.

'7' కు రిటైర్మెంట్ ఇచ్చేసిన బీసీసీఐ

మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా భారతదేశానికి చేసిన సేవలు ఏ క్రికెట్ అభిమాని మరచిపోడు. అలాంటి ఆటగాడికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అద్భుతమైన ట్రిబ్యూట్ ఇచ్చింది. గతంలో సచిన్ టెండూల్కర్ వేసుకున్న జెర్సీ నెంబర్ 10కి ఎలాగైతే రిటైర్మెంట్ ఇచ్చిందో ఇప్పుడు కూడా అదే తరహాలో ధోని విషయంలో ప్రవర్తించింది బీసీసీఐ.

ధోనీనే గెలిచాడు.. ఆ ఐపీఎస్ అధికారికి జైలు శిక్ష

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోర్టు కేసులో గెలిచాడు. ధోని దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హై కోర్టు రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి జి సంపత్ కుమార్‌కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. అయితే తీర్పుపై అప్పీల్ చేయడానికి అధికారికి సమయం ఇస్తూ.. శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది.

Breaking : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణించారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ప్రమాదం జరిగింది. ఉండి మండలం చెరుకువాడ సమీపంలో ఎమ్మెల్సీ సాబ్జీ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో సాబ్జి మృతి చెందారు. డ్రైవర్ కు, ఆయన గన్ మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి.

Rajasthan : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణం

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన భజన్ లాల్ శర్మ రాజస్థాన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

Telangana : నలుగురు విప్ లు నియామకం

రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరసగా పదవులను భర్తీ చేస్తుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు పోస్టుల నియామకం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం విప్ లను నియమించింది. విప్ లుగా నలుగురిని నియమించింది. అడ్డూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్‌లను ఎంపిక చేసింది. నలుగురూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు.

నన్ను ఆత్మహత్య చేసుకోనివ్వండి : మహిళ న్యాయమూర్తి

తనను ఆత్మహత్యకు అనుమతివ్వాలని మహిళ న్యాయమూర్తి కోరడం సంచనలం కలిగించింది. సీనియర్ న్యాయమూర్తి లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు కోరుతూ చీఫ్ జస్టిస్ ను అభ్యర్థించడం న్యాయ చరిత్రలో కలకలం సృష్టించింది. ఉత్తర్‌ప్రదేశ్ లోని బందా జిల్లా మహిళ న్యాయమూర్తి ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఈ మేరకు లేఖ రాశారు.

Sajjala : చంద్రబాబువి పగటి కలలు.. అధికారంలోకి రావడం కల

ముఖ్యమంత్రి జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతృప్తికరంగా ఉన్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు మూడు నెలల్లో వచ్చేస్తామంటారు.. కానీ ఎక్కడికి? అంటూ ఆయన ప్రశ్నించారు. మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.

Sreeleela - Mrunal : శ్రీలీలని చూసి స్ఫూర్తి పొందానంటున్న మృణాల్..

టాలీవుడ్ లో ప్రస్తుతం శ్రీలీల, మృణాల్ ఠాకూర్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. యూత్ లో మంచి క్రేజీని సంపాదించుకుంటూ వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ ముందుకు దూసుకు పోతున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో శ్రీలీల నటిస్తుంటే, మృణాల్ ఠాకూర్ యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ తో అభిమానుల మనసు దోచుకుంటున్నారు. మృణాల్ రీసెంట్ గా 'హాయ్ నాన్న' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు.


















Tags:    

Similar News