టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

విశాఖకు వస్తా: పవన్ కళ్యాణ్, ఆర్టికల్ 370 రద్దుపై...కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన ధర్మాసనం, మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్

Update: 2023-12-11 12:51 GMT

latest telugu news

ఆర్టికల్ 370 రద్దుపై...కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన ధర్మాసనం

ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టులో తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పార్లమెంట నిర్ణయానని కొట్టి పారేయలేమని పేర్కింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంగా ధర్మాసనం అభిప్రాయ పడింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.

విజయవాడ బాబాయ్ హోటల్‌లో వెంకీ మామ సందడి..

Venkatesh : విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన 75వ సినిమా 'సైంధవ్‌'ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్ నిర్వహిస్తూ సందడి చేస్తుంది.

విశాఖకు వస్తా: పవన్ కళ్యాణ్

విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేతపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు.

మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ను నియమిస్తూ బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో మోహన్ యాదవ్ మంత్రిగా పనిచేశారు. స్పీకర్ గా నరేంద్ర సింగ్ తోమర్ ను నియమించే అవకాశాలున్నాయని తెలిసింది. మధ్యప్రదేశ్ సిఎం ఎవరన్న ఉత్కంఠకు ఎట్టకేలకు బీజేపీ అధినాయకత్వం తెరదించినట్లయింది.46ఏళ్ళ వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ కమెడియన్‌ని గుర్తు పట్టారా..?

46ఏళ్ళ వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ కమెడియన్‌ని గుర్తు పట్టారా..?

ఇటీవల రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాల్లో తనదైన మార్క్ కామెడీతో ఆడియన్స్ ని అలరించిన ఒక స్టార్ కమెడియన్.. 46 ఏళ్ళ లేటు వయసులో ప్రేమ వివాహం చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు. ప్రస్తుతం ఆ కమెడియన్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో మీరు గుర్తు పట్టారా..?

అందుకే ఆళ్ల రాజీనామా... గాజువాక కూడా అదే దారిలోనట

వైసీపీలో వరస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ గాజువాక ఇన్‌ఛార్జి పదవికి దేవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మంత్రి అమర్ నాధ్ ను నియమించనున్నారని తెలిసింది. రానున్న ఎన్నికలకు జగన్ సిద్ధమవుతూ వచ్చే ఎన్నికల్లో స్థానాలను మార్చడానికి సిద్ధమవుతున్నారు.కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ

కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి అన్ని విషయాలను చంద్రబాబు తెలుసుకున్నారు.

స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నెల 14వ తేదీన స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఉదయం 10.30 గంటలకు నూతన స్పీకర్ నియామకం జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక కోసం ఈ నెల 13వ తేదీ ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

నేడు వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల

వైఎస్సార్ లా నేస్తం నిధులు కింద నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ నిధులను యువ లాయర్ల ఖాతాల్లో జమ చేయనున్నారు. జూనియర్ న్యాయవాదులకు అండగా నిలవాలన్న ఉద్దేశ్యంతో వైఎస్సార్ లా నేస్తం ను ఏర్పాటు

పాదయాత్ర @ 3000 కి.మీ

నారా లోకేశ్ పాదయాత్ర ముగింపు వేదిక ఖరారయింది. ఈనెల 20వ తేదీన పాదాయత్ర ముగియనుంది. భోగాపురం మండలం పోలిపల్లిలో లోకేశ్ పాదయాత్ర ముగియనుంది. అక్కడ రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగళం పాదాయత్ర మూడు వేల కిలోమీటర్లకు చేరుకుంది.

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )




Tags:    

Similar News