టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-12-16 12:45 GMT

latest top 10 telugu news

గుడ్ న్యూస్: కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్

తెలంగాణలో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ అంశంపై కసరత్తు ప్రారంభించింది. ప్రజలు చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కొత్త రేషన్‌ కార్డులు గత 9 ఏళ్లుగా జారీ కాకపోవటంతో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు.

5447 Jobs in SBI : దరఖాస్తు చేసుకోవడానికి రేపు (డిసెంబర్ 17) చివరి తేదీ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్‌బీఐకు చెందిన వివిధ సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5,447 సీబీవో పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేయాలని భావిస్తూ ఉంది.

ప్రభాస్ సినిమాకు టికెట్లు పచుతున్న మరో హీరో

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడప్పుడా అంటూ ఎదురుచూస్తున్న తరుణం దగ్గర పడుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ రిలీజ్ కి రెడీ అయ్యింది. మరో ఆరు రోజుల్లో మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు కొనుగోలు చేద్దామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.Breaking: దొంగని వదిలేసి మీడియాకి సూక్తులు చెప్తున్న పోలీసులు

Breaking: దొంగని వదిలేసి మీడియాకి సూక్తులు చెప్తున్న పోలీసులు

హైదరాబాద్‌లో ఓ దొంగ పోలీసులను రాత్రంతా మేలుకునేలా చేశాడు. సూరారంలో తాళం వేసిన ఇంట్లో దొంగ చోరీకి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పారిపోయి చెరువులోని బండపై తిష్ట వేశాడు. పోలీసులు ఎంత పిలిచినా దొంగ బయటకు రాలేదు. చివరికి పోలీసుల కనుగప్పి దొంగ పరారయ్యాడు.

సిగ్గుపడుతున్నా: కేటీఆర్

తెలంగాణ శాసన సభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళిసై ప్రసంగం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. రాచరిక పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిందని, ప్రజా పాలన మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంగ్లండ్ ను దారుణంగా ఓడించిన టీమ్ ఇండియా

ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 347 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ ను మూడ్రోజుల్లోనే ఓడించింది. కొన్ని సెషన్స్ కూడా బాగా ఆడలేకపోయారు ఇంగ్లండ్ బ్యాటర్లు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

తెలంగాణ హైకోర్టుకు చేరిన.. కాలుష్య 'దుర్గం'

హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువులో చేపలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. ఎన్నోసార్లు చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతూ కనిపించాయి. చేపలు ఆక్సిజన్ ఆందక నీటిపైకి వచ్చి ఊపిరి పీల్చుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చేపలు చనిపోవడంపై సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు.

రానని చెప్పేసిన జనసేనాని

టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తోంది టీడీపీ. 2023, జనవరి 27న ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర డిసెంబర్ 20తో ముగియనుంది. డిసెంబర్ 20న విశాఖపట్నం భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలో యువగళం ముగింపు సభ జరుగనుంది.

బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలుశిక్ష

బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఘటన జరిగిన 9 సంవత్సరాల తర్వాత దోషిగా తేలి శిక్ష పడడంతో అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. సోన్‌భద్ర జిల్లాలోని దుద్ధి నియోజకవర్గ గిరిజన ఎమ్మెల్యే రాందులార్ గోండ్ 4 నవంబర్ 2014లో బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై మయోర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Salaar : సలార్ తొలి టికెట్‌ని భారీ ధరకి కొన్న రాజమౌళి.. ఎంతో తెలుసా..?

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడప్పుడా అంటూ ఎదురుచూస్తున్న తరుణం దగ్గర పడుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ రిలీజ్ కి రెడీ అయ్యింది. మరో ఆరు రోజుల్లో మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు కొనుగోలు చేద్దామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.














Tags:    

Similar News