టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-12-09 12:30 GMT

నోట్: కింద ఉన్నహెడ్లైన్ ని క్లిక్ చేయండి


ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ముందుగా

రేవంత్‌రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి సమావేశాలు శనివారం ప్రారంభం అయ్యాయి. ముందుగా పబ్లిక్ గార్డెన్స్‌లోని అసెంబ్లీ హాల్‌లో శనివారం ఉదయం 11:00 గంటలకు జరగనున్న తెలంగాణ మూడో శాసనసభ ప్రారంభ సమావేశానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా సమావేశమయ్యారు.షెడ్యూల్ ప్రకారం, ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్ ఒవైసీని ప్రోటెం స్పీకర్‌గా నియమించారు.

ఆఫ్ఘనిస్థాన్ మీద విజయం.. ఆసియా కప్ లో భారత్ కుర్రోళ్ల

దూకుడుదుబాయ్‌లోని ఐసిసి అకాడమీలో అఫ్ఘనిస్థాన్‌ మీద ఏడు వికెట్ల తేడాతో భారత జట్టు విజయం అందుకుంది. U19 ఆసియా కప్‌లో భారతజట్టు శుభారంభం సాధించింది. అర్షిన్ కులకర్ణి బ్యాట్, బాల్ తో రాణించాడు. అతను 8-0-29-3తో రాణించడంతో ఆఫ్ఘన్‌ జట్టును 173కి పరిమితం చేయడంలో సహాయపడింది. బ్యాటింగ్ లో 105 బంతుల్లో నాలుగు ఫోర్లతో అజేయంగా 70 పరుగులు చేశాడు అర్షిన్ కులకర్ణి. దీంతో భారత్ 12.3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తుంటి ఎముక ఫ్రాక్చర్ అయింది. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయింది. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్సను నిర్వహించి, స్టీల్ ప్లేట్లను అమర్చారు. ఆయన వాకర్ ఆధారంగా నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మరోసారి రిలీఫ్ ఇచ్చింది. రెపో రేట్లను యథాతథంగా ఉంచారు. ఆర్‌బీఐ వరుసగా ఐదోసారి ఈ అద్భుతాన్ని సాధించింది. వాస్తవానికి, రెపో రేటులో తగ్గింపు లేనందున, వినియోగదారులు, రుణగ్రహీతలు పెరిగిన రేటుతో EMI చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా పెరగకపోవడమే పెద్ద రిలీఫ్. మరోవైపు యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ గట్టి నిర్ణయం తీసుకుంది.

ప్రొటెం స్పీకర్‌‌గా అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రమాణ స్వీకార

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగనుంది. శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ మేరకు ముందుగా అక్బరుద్దీన్ తో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మళ్లీ మొదలైంది. మిగ్జామ్ తుపాను కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తుపాను ప్రభావం ముగియడంతో లోకేశ్ పాదయాత్ర మళ్లీ మొదలుపెట్టారు.

ప్రభుత్వ సలహాదారుల తొలగింపు.. ఎంతమందినంటే?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వారిని రేవంత్ ప్రభుత్వం తొలగించింది. ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో సోమేశ్ కుమార్, శోభ, జీఆర్ రెడ్డి, చెన్నమనేని రమేశ్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ ఉన్నారు. వీరి స్థానంలో కొత్త సలహాదారులను నియమించనున్నారు.


ఉచిత ప్రయాణం మొదలు.. వారి జీవితాల్లో చీకట్లు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.


మరో విషాదం: సీనియర్ నటి కన్నుమూత

ప్రముఖ దక్షిణాది నటి లీలావతి కన్నుమూశారు. ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 600కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. కన్నడ, తమిళం, తెలుగు, మళయాళం భాషల్లో నటించింది. లీలావతి కన్నడలో 400కు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్నో గొప్ప పాత్రల్లో ఆమె నటించారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడంతో తుదిశ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగనుంది. శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతను ఎన్నుకున్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. బీఆర్‌ఎస్‌ శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశంలో తీర్మానం చేయనున్నారు.















Tags:    

Similar News