రాచూరులోని వెయ్యేళ్లనాటి ఆలయాలు, శిల్పాలను కాపాడుకోవాలి- పురావస్తు పరిశోధకుడు డా. ఈమని శివనాగిరెడ్డి

రాచూరులోని వెయ్యేళ్లనాటి ఆలయాలు, శిల్పాలను కాపాడుకోవాలినాగర్ కర్నూలు జిల్లా, వెల్దండ మండలం, రాచూరులోని వెయ్యేళ్లనాటి ఆలయాలు, శిల్పాలు, శాసనాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. రాచూరు గ్రామానికి చెందిన కోవూరి వెంకటరావు, బెక్కిరి సురేష్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారం నాడు రాచూరులోని హనుమాన్, శివ, భైరవ, కేశవ, పోచమ్మ ఆలయాలను, శిల్పాలను, శాసనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

Update: 2023-12-24 10:05 GMT

archeological placesintelangana

రాచూరులోని వెయ్యేళ్లనాటి ఆలయాలు, శిల్పాలను కాపాడుకోవాలినాగర్ కర్నూలు జిల్లా, వెల్దండ మండలం, రాచూరులోని వెయ్యేళ్లనాటి ఆలయాలు, శిల్పాలు, శాసనాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. రాచూరు గ్రామానికి చెందిన కోవూరి వెంకటరావు, బెక్కిరి సురేష్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారం నాడు రాచూరులోని హనుమాన్, శివ, భైరవ, కేశవ, పోచమ్మ ఆలయాలను, శిల్పాలను, శాసనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హనుమాన్ ఆలయం ముందున్న రాతి కలశం, ఆలయంలో పూడుకుపోయిన శాసనం, రంగులతో కళతప్పిన సప్తమాతల శిల్పం, శిధిల శివాలయంలో భిన్నమైన భైరవ విగ్రహం, పోచమ్మ గుడి దగ్గర అమ్మవారు, భూమిలో కూరుకుపోయిన త్రికూటాలయం, కప్పురాళ్లు జారిపడిపోయిన శివాలయాలను పదిలపరచాలని రాచూరు గ్రామ ప్రజలకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.





శాసనాలను పరిశీలించిన ఆయన రాచూరుకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని, శాసనాల్లో ఈ ఊరి పేరు రావితొర్రు, రావితొరుతి అని ఉందని, ఇక్కడ క్రీ.శ. 1137, ఫిబ్రవరి 21 నాటి కళ్యాణి చాళుక్య మూడో తైలపుని శాసనం, క్రీ.శ. 1157 డిసెంబర్ 27 నాటి కందూరు చోళ రాజు రెండో ఉదయాదిత్యుని శాసనం, అతనివే క్రీ.శ. 1159 అక్టోబర్ 24 మరియు క్రీ.శ. 1160వ సంవత్సరం శాసనాలు ఉన్నాయని, స్థానిక కేశవ దేవరకు, పానగల్లులోని సోమనాథ దేవాలయంలోని కేశవ దేవర దీపాలకు స్థానిక మల్లిశెట్టి, భూమి, మేకలు దానం చేసిన వివరాలున్నాయన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల శిల్పాలు, శాసనాలపై వేసిన రంగులు తొలగించి, శిథిలమైన ఆలయాలను పదిలపరిచి, భావితరాలకు అందించాలని శివనాగిరెడ్డి కోరారు.




 


 


 


Tags:    

Similar News