Tue Feb 03 2026 06:41:09 GMT+0000 (Coordinated Universal Time)
లొంగిపోయిన ఎర్రగంగిరెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్రగంగిరెడ్డి కొద్దిసేపటి క్రితం సీబీఐ కోర్టులో లొంగిపోయారు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్రగంగిరెడ్డి కొద్దిసేపటి క్రితం సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఎర్ర గంగిరెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడుగా ఉన్నారు. ఆయనకు గతంలో బెయిల్ ఇచ్చింది. అయితే విచారణపైన, సాక్షులపైన గంగిరెడ్డి ప్రభావం చూపుతారని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది.
సీబీఐ ఎదుట...
దీంతో ఎర్ర గంగిరెడ్డి హైదరాబాదు కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారుల ఎదుట లొంగిపోయాడు. ఈ నెల 5న సిబిఐ కోర్టులో లొంగిపోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో న్యాయవాదుల సలహాల మేరకు ఆయన ఈరోజు లొంగిపోయాడు.
Next Story

