హైదరాబాద్ వస్తున్నారా? అయితే మీరు ఫోన్ చేస్తే క్యాబ్ వచ్చే అవకాశం లేదు. ఐదు రోజులు సిటీరోడ్లపై క్యాబ్ లు కన్పించవు. ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగుతున్నారు. ఈ అర్ధరాత్రి నుంచి జనవరి నాలుగో తేదీ వరకూ సమ్మెలో ఉంటారు. ఓలా, ఊబర్ యాజమాన్యాల వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు, ఓనర్ల అసోసియేషన్ తెలిపింది. బుకింగ్స్ లేక...కార్ల ఈఎంఐలను కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం కూడా తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోయారు. అదేమిటని ప్రశ్నించినందుకు యాజమాన్యం తమపై దాడులకు దిగుతుందని...అందుకోసమే సమ్మెకు దిగుతున్నట్లు వారు చెప్పారు.
సో....నాలుగురోజులు హైదరాబాద్ లో మీకు క్యాబ్ లు కన్పించవన్న మాట.