Aadhar : ఆధార్ అప్ డేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంటివద్దే ఇలా?

ఆధార్ కార్డులో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటుండాలి.

Update: 2025-12-14 05:55 GMT

ఆధార్ కార్డులో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటుండాలి. ప్రభుత్వాల నుంచి ఏ రకమైన పథకాన్ని పొందాలన్నా, సేవలు లభించాలన్నా దేశంలో ఆధార్ కార్డు అనేది ముఖ్యమైనది. ఆధార్ కార్డుతోనే ఇప్పుడు దేశంలోనే అనేక పనులు జరుగుతున్నాయి. బ్యాంకింగ్ కార్యక్రమాల నుంచి చివరకు ఫోన్ లో కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. అందుకోసం దేశంలో వయసుతో నిమిత్తం లేకుండా ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకుంటూ తగిన రీతిలో ఉంచుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన ప్రయోజనాలను పొందే వీలుంది.

వీరు మాత్రమే...
అయితే వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు తమ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాలంటే మీ సేవ కేంద్రాలకు వెళ్లడం కష్టంగా మారిన తరుణంలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు పొందాలనుకున్నా, కార్డు అప్ డేట్ చేయాలనుకున్నా ఇంటివద్దనే సేవలందించాలని నిర్ణయించింది. అయితే ఒక్కొక్క కార్డుకు ఏడు వందల రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. సిబ్బంది ఇంటికి వచ్చి ఆ సమాచారాన్ని తీసుకుని ఆధార్ కార్డును అప్ డేట్ చేస్తారు. కొత్త కార్డు ను కూడా మంజురు చేసేలా భారత విశిష్ట ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకోవడం సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట అని చెప్పాలి.
ఉడాయ్ ప్రాంతీయ కార్యాలయంలో...
అయితే ఇందుకోసం భారత విశిష్ట ప్రాధికార సంస్థ కు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక లెటర్ రాసినా సరిపోతుంది. ఉడాయ్ ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే సిబ్బంది మీ ఇంటికి వచ్చి వివరాలను నమోదు చేసుకుంటారు. తర్వాత కార్డు మీ ఇంటి అడ్రస్ కు చేరుకుంటుంది. అయితే సీనియర్ సిటిజన్లు, నడవలేని వారు, దీర్ఘకాలిక రోగులు, మంచానికే పరిమితమయిన వారు మాత్రమే ఈ రకమైన సౌకర్యానికి అర్హులు. మెడికల్ ఇచ్చిన సర్టిఫికేట్ ను కూడా దరఖాస్తుతో పాటు జత చేసి పంపితే మీ ఇంటికే వచ్చి ఆధార్ కార్డు అప్ డేట్ ను చేసుకుంటారు. ఆధార్ కార్డులో తప్పులున్నా సరిచేసుకునే వీలుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News