Gold Price Today : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే సరైన సమయం
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి.
బంగారం ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ఎంతగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వెండి ధరలు బంగారాన్ని మించి పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే భారీగా పెరిగిన బంగారం ధరలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు చేయాలనుకున్న వారు కూడా అటువైపు చూడటం లేదు. బంగారం అంటే ఒక రకంగా భయం పట్టుకుంది. ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉంది. పది గ్రాముల బంగారం ధర ఇప్పటికే లక్షన్నరకు చేరువలో ఉంది. అదే సమయంలో కిలో వెండి ధరలు రెండున్నర లక్షలకు దరిదాపుల్లో ఉన్నాయి. ఇంత పోసి బంగారం, ధరలు కొనుగోలు చేయడం అనేది చాలా కష్టమైన విషయం. రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని, అవసరం ఉన్న వాళ్లు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
స్కీమ్ లు కట్టే వారు కూడా...
మరొక విషయం ఏంటంటే బంగారం విషయంలో మహిళలు గతంలో భర్తలను కూడా లెక్క చేసేవారు కాదు. తాము చిన్న చిన్నగా పొదుపు చేసుకున్న మొత్తంతో బంగారాన్ని కొనుగోలు చేసేవారు. మరొకవైపు జ్యుయలరీ దుకాణాలు కూడా నెలవారీగా స్కీమ్ లు పెట్టేవి. నెలకు ఐదు వేలు కట్టినా ఏడాదికి అరవై వేలు మాత్రమే వస్తుంది. అంటే కనీసం పది గ్రాములు కాదు కదా.. ఐదు గ్రాముల బంగారం కూడా ఈ స్కీమ్ డబ్బులతో వచ్చే అవకాశాలు లేకపోవడంతో స్కీమ్ లు కట్టేవారు కూడా కనిపించడం లేదు. రాను రాను బంగారం మరింత భారంగా మారుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అదే సమయంలో వెండి ధరలు కూడా అదుపు లేకుండా పరుగులు తీస్తాయంటున్నారు.
వచ్చే ఏడాది కూడా...
వచ్చే ఏడాది ధరలు మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఏ రేంజ్ లో పెరుగుతాయన్నది చెప్పలేని పరిస్థితి. అందుకే 2026 కూడా బంగారం ప్రియులకు చేదు సంవత్సరంగానే మిగలనుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,33,910 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,33,910 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,10,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు. పెరగొచ్చు. తగ్గొచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు.