స్పీకర్ చైర్ కు అవమానం : విపక్షం దుడుకుతనం

Update: 2016-11-24 06:41 GMT

లోక్ సభ లో గురువారం అరుదైన అవాంఛనీయ సంఘటన జరిగింది. స్పీకర్ చైర్ ను అవమానించేలా సమాజ్ వాది పార్టీకి చెందిన ఎంపీ అక్షయ్ యాదవ్ దూకుడు ప్రదర్శించారు. పేపర్ లను చించి స్పీకర్ కేసి విసరి కొట్టారు. ఆయనపై చర్య తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

గురువారం సభ మొదలయ్యాక ఎప్పటి లాగానే విపక్షాలు రాద్ధాంతం చేయడం ప్రారంభించాయి. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి రాద్ధాంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో సభ పలుమార్లు వాయిదా పడింది. 12 గంటల సమయంలో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్ సుమిత్ర మహాజన్ చైర్ లోంచి లేస్తుండగా ఇలా కాగితాలు విసరి కొట్టారు.

సభా వ్యవహారాల మంత్రి ఆనంతకుమార్ దీనిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసారు. అక్షయ్ యాదవ్ పై చర్య తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Similar News