దివంగత నేత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య జరిగి ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ హత్య లో నిందితులుగా నిర్ధారించబడిన నళిని, మురుగన్, శాంతన్, పేరరివాళన్ లతో పాటు మరో ఏడుగురికి సుప్రీమ్ న్యాయస్థానం ఉరి శిక్షను విధించగా తరువాతి కాలంలో నళిని అనే ముద్దాయికి ఉరి శిక్షను సవరించి యావజ్జీవ జైలు శిక్ష ను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. దేశ చరిత్రలో అత్యధిక కాలం కారాగార జీవితాన్ని గడిపిన ఖైదీగా నళిని పేరు చరిత్రకెక్కింది. ఎనిమిది సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ తనయ ప్రియాంక గాంధీ నళినితో రహస్యంగా సమావేశమవటం చర్చనీయాంశంగా మారింది.
అప్పటి వారి చర్చలో ప్రస్తావనకు వచ్చిన సమాచారం ఏది బహిర్గతం కాలేదు. అనేకమంది వారి వారి ఊహలకు కొన్ని కథనాలు ప్రచురించినప్పటికీ అవి వాస్తవానికి అమ్మడు దూరంలో నిలిచిపోయాయి. కాగా జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని తన ఆత్మ కథకు 'పాతి పెట్టిన నిజాలు' పేరుతో పుస్తక రూపం ఇవ్వగా, ఈ 600 పేజీల పుస్తకంలో ప్రియాంక గాంధీ తనతో జరిపిన రహస్య సమావేశానికి సంబంధించిన సంఘటనను కూడా నళిని ప్రస్తావించారు. ఈ పుస్తకం ఇప్పుడు విడుదల కానుంది. ప్రియాంక గాంధీ చర్చతో పాటు రాజీవ్ గాంధీ హత్యకు తెర వెనుక రూపకర్తలు, శిక్షార్హులు ఐయి ఉండి తప్పించుకున్నవారెవరు అనే కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు నళిని కోణంలో నుంచి సమాధానం దొరకనుంది.