వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త..

Update: 2018-05-30 02:12 GMT

దేశంలో ఇప్పటికే 20 కోట్ల మందికి సేవలంధిస్తున్న వాట్సాప్ తన వినియోగదారులకు మరో కొత్త సేవను అందుబాటులోకి తీసుకువస్తోంది. వాట్సాప్ పేమెంట్స్ పేరుతో వాట్సాప్ ద్వారానే చెల్లింపులు, లావాదేవీలు చేసుకునే సరికొత్త ఫీచర్ ను వచ్చే వారం నుంచే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులతో ఒప్పందాలు కూడా చేసుకుంది. త్వరలోనే ఎస్బీఐ సహా మరికోన్ని బ్యాంకులతో ఒప్పందం చేసుకోనుంది. అయితే, వాట్సాప్ పేమెంట్స్ ద్వారా ఇప్పటికే ఈ రకమైన సేవలంధిస్తున్న పేటీఎం, ఫ్రీచార్జి వంటి సంస్థలకు భారీ ఎదురుదెబ్బ తగలే అవకాశం ఉంది. ముఖ్యంగా పేటీఎంకు వాట్సాప్ గట్టి పోటీ ఇవ్వనుంది.

Similar News