ఆత్మహత్య చేసుకున్న కెమెడియన్ విజయ్ సాయి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న విజయ్ భార్య వనిత, శశిధర్ లు పోలీసులకు అందుబాటులో లేరు. కాని వనిత మాత్రం రోజుకో వీడియో విడుదల చేస్తూ సంచలనం సృష్టిస్తుంది. విజయ్ ఇతర మహిళలతో ఉన్న ఫొటోలను వనిత బయటపెట్టింది. దీంతో పాటు ఒక సెల్ఫీ వీడియోను కూడా రిలీజ్ చేసింది. విజయ్ కు అనేక మందితో అక్రమ సంబంధాలున్నాయని, అది అడిగినందుకు తనను రోజూ కొట్టేవాడని ఆ వీడియోలో పేర్కొంది. విజయ్ నిజస్వరూపం తెలియజేయడానికే ఈ ఫొటోలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. తాను కూతురి కోసమే బతుకుతున్నానని, సినిమాల్లో, టీవీల్లోనూ తనకు అవకాశాలు తగ్గాయని చెప్పింది. తన బాధను ఎవరు అర్థం చేసుకుంటారని ప్రశ్నించింది. తాను ఎక్కడికీ పారిపోలేదని, త్వరలోనే పోలీసుల ఎదుటకు పూర్తి సాక్ష్యాధారాలతో వస్తానని చెప్పింది. కాగా వనిత ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె కాకినాడలో ఉందని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. కాకినాడకు ఒక బృందం బయలుదేరి వెళ్లినట్లు సమాచారం.