లంబాడీలు...వర్సెస్ ఆదివాసీలు...రిజర్వేషన్లు పెట్టిన చిచ్చు...టెన్షన్...టెన్షన్

Update: 2017-12-16 04:03 GMT

లంబాడీలు, ఆదివాసీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆదిలాబాద్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆదివాసీ వీరుడు కొమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయడంతో రెండు వర్గాల మధ్య అగ్గిరాజుకుంది. లంబాడీలు, ఆదివాసీల మధ్య ఇటీవల రిజర్వేషన్ చిచ్చు రేగింది. దీంతో లంబాడీలు, ఆదివాసీలు పరస్పరం ఘర్షణలకు దిగారు. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. హుస్నాపూర్, ఉట్నూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాణిజ్య సముదాయాలను, వాహనాలను, మద్యం షాపులను తగులపెట్టారు. పరస్పరం రాళ్లదాడిలో అనేకమందికి గాయాలయ్యాయి. ఒక వాహనం ప్రమాదానికి గురై కొందరికి గాయాలు కావడంతో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.పోలీసులు పెద్దయెత్తున మొహరించారు. ఏజెన్సీ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

Similar News