మద్దతిస్తే మంత్రులమయిపోతామా?

Update: 2016-12-28 11:38 GMT

కేంద్ర మంత్రివర్గంలో చేరాలా? వద్దా? అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరికపై ఇప్పటివరకూ ఎలాంటి చర్చలు జరగలేదని కవిత స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సబబనిపించి మాత్రమే తప్పని పరిస్థితుల్లో మోదీ సర్కారుకు మద్దతిచ్చామన్న కవిత....ఒక విషయంలో సపోర్ట్ చేసినంత మాత్రాన కేంద్రప్రభుత్వంలో చేరిపోయినట్లేనా? అని ప్రశ్నించారు. పదవుల కోసమే కేంద్రానికి మద్దతిచ్చామని విన్పిస్తున్న విమర్శలు అర్ధం లేనివని కవిత కొట్టిపారేశారు.

Similar News