ప్రత్యర్థుల డిమాండ్లన్నీ బుట్ట దాఖలే!

Update: 2016-10-02 16:39 GMT

జిల్లాల ఏర్పాటు అనేది దాదాపుగా శాశ్వతమైన ప్రక్రియ. ప్రభుత్వాలు ప్రకటించే సంక్షే మ పథకాల్లాగా.. ఎవరికి తోచిన పేరు పెట్టేసుకోకుండా.. వాటి నామకరణానికి ఒక శాశ్వతమైన ప్రాతిపదిక ఉండేలా చేస్తేనే వాటికి విలువ ఉంటుంది. అయితే కేసీఆర్‌ ఇప్పుడు చేపడుతున్న జిల్లాల విభజన ఈ రీతిగా జరుగుతున్నదేనా? లేదా, తన తోచిన రీతిగా చీల్చుకుంటూ వెళ్లిపోయారా అనేది ప్రశ్న.

కేసీఆర్‌ జిల్లాల విభజనకు నిర్ణయం తీసుకున్న నాటినుంచి రకరకాల విమర్శలు వచ్చాయి. అయితే అవన్నీ రాజకీయ విమర్శలు అంటూ చర్చకు కూర్చోవడానికి వచ్చారు. దాంతో విమర్శల్లో పసలేనిదని తేలిపోయింది.

విభజన నాటికే జిల్లాల్ని చిన్నవి చేయడం గురించిన సమాచారం తన వద్ద ఉన్నదని, ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఉన్నప్పుడే ఎలా విభజించాలో అప్పట్లో చర్చించుకునేవాళ్లం అని కేసీఆర్‌ అంటున్నారు.

అయితే ఈ జిల్లాల ఏర్పాటు విషయంలో కేసీఆర్‌.. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఒక నిర్ణయానికి వచ్చినట్లుంది. అయితే అభ్యంతరాల రూపంలో తమ ప్రాతానికి జిల్లా కావాలని కోరుతూ చాలా మంది నేతలు చేసిన ప్రయత్నాలు ఇతరత్రా డ్రై అయిపోయినట్లు కనిపిస్తఓంది.

Similar News