ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం స్పిల్ వే కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటికే నాబార్డు 1900 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీంతో పోలవరం పనులు ఊపందుకున్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎక్కడ చూసినా ఆధునిక యంత్రాల వినియోగం కన్పిస్తోంది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. వచ్చే ఎన్నికలకు ముందే పోలవరం నుంచి ఒక కాల్వ ద్వారానైనా నీటిని విడుదల చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.