టర్కీ లో విషాదం చోటు చేసుకుంది. ఇస్తాంబుల్ నైట్ క్లబ్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 35 మంది మృత్యువాత పడ్డారు. శాంతాక్రజ్ వేషంలో వచ్చిన ఉగ్రవాదులు నైట్ క్లబ్ నే టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగపడ్డారు. ఈ దాడుల్లో ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాదాపు వంద మంది క్షతగాత్రులయ్యారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరుగుతాయని ముందే హెచ్చరికలు జారీ అయినా...ఫలితం కన్పించలేదు. టర్కీ, ఇస్తాంబుల్, అంకారాలో పోలీసులు తనీఖీలు చేపట్టారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇది ఐసిస్ ఉగ్రవాదుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.