రెండు శతాబ్దాల బానిస బతుకు నుంచి భారతీయులకు విముక్తి కలిగించటానికి జీవితం మొత్తాన్ని ధార పోసిన స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. అటువంటి సాహసోపేతుడు అయిన బోస్ శ్రమని చిత్రీకరించకుండా నాటి ప్రముఖ రాజకీయ నేతలుగా వున్న ఇతర స్వతంత్ర సమర యోధులు అడ్డుకున్నారు. అందుకే బోస్ మరణం పై కూడా పలు అనుమానాలు తరతరాలుగా వ్యక్తమవుతూనే వున్నాయి. జపాన్ దేశం నుంచి రష్యా దేశానికి విమానంలో ప్రయాణం చేస్తుండగా ఆ విమానం ప్రమాదానికి గురికావటంతో బోస్ మరణించినట్టు చరిత్ర చెప్తుంది. అయితే ఈ మరణానికి ఆధారం లేని కారణాన స్పష్టత లేకపోవటం పైగా అనేక సందేహాలు వెలువడటంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విమాన ప్రమాదంలో మరణించినట్టు అధికారిక ప్రకటన చేసింది.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మనువడు, పరిశోధకుడు ఐన ఆశిష్ రాయ్ కొన్ని ఆధారాల సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసిన అధికార ప్రకటనకు ఏకీభవిస్తునట్టు తెలిపారు. "జపాన్ లో నేతాజీ ప్రాణాలకు ముప్పు ఉండటంతో ఆయన అక్కడి నుంచి రష్యా దేశం చేరుకొని అక్కడి నుంచి మన దేశ స్వాతంత్ర్యానికి పలు ఆందోళనలు ప్రపంచ స్థాయిలో చేసేందుకు ప్రణాళికతో పయనమైనట్టు చరిత్ర చెప్తుంది. కాగా 18 ఆగస్టు 1945 తరువాత నేతాజీ సోవియెట్ దేశాలకు చేరుకున్న దాఖలాలు లేవు. అదే రోజు టోక్యో నుంచి బయల్దేరిన విమానం తైవాన్ లో ప్రమాదానికి గురై ప్రయాణికులు, సిబ్బంది అందరూ మృతి చెందారు. నేతాజీ మరణం భావోద్వేగాలకు సంబంధించినది అయినప్పటికీ వాస్తవాలు అంగీకరిస్తూ చరిత్రని గౌరవించటం మన బాధ్యత." అని బోస్ మరణాన్ని ఆయన మూడవ తరం వారసుడు ఆశిష్ రాయ్ నిర్థారించారు.