KCR: మూడున్నర గంటలుగా కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్ లోని నందినగర్ లో కేసీఆర్ ను గత మూడు గంటలుగా విచారిస్తున్నారు

Update: 2026-02-01 12:53 GMT

హైదరాబాద్ లోని నందినగర్ లో కేసీఆర్ ను గత మూడు గంటలుగా విచారిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయిన విచారణ ఇంకా కొనసాగుతుంది. మధ్యాహ్నం మూడు గంటలకు సిట్ అధికారులు తమ విచారణను ప్రారంభించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకూ చేపట్టిన విచారణలో పెద్దాయన చెప్పడం వల్లనే తాము చేశామని చెప్పడంతో ఎవరా పెద్దాయన అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. కేసీఆర్ ఇంట్లోని రెండో ఫ్లోర్ లోని గదిలో సిట్ విచారణ కొనసాగుతుంది. విచారణ సమయంలో కేసీఆర్ ఒక్కరిని మాత్రమే అనుమతిచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో...
అయితే న్యాయసలహా అందించేందుకు మాత్రం న్యాయవాది రామచంద్రరావును మాత్రం విచారణలో ఉండేందుకు అనుమతించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అనేక మంది మాజీ ఉన్నతాధికారులు, నేతలను ప్రశ్నించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ లను కూడా విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణతో ముగిసే అవకాశముంది. అందువల్లనే దాదాపు మూడున్నర గంటల నుంచి కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతున్నారని అంటున్నారు.
తెలంగాణ భవన్ వద్ద...
మరొకవైపు కేసీఆర్ ను ఈ వయసులో ఇన్ని గంటల పాటు విచారిస్తారా? అంటూ తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నందినగర్ నివాసానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. అయితే అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ కక్షతోనే కేసీఆర్ ను వేధిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలకు తెలియజేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.


Tags:    

Similar News