Nirmala Sitaraman : హైదరాబాద్ కు నిర్మలమ్మ వరాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

Update: 2026-02-01 06:14 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్ల ను కేటాయిస్తున్నట్లు చెప్పారు. సెమి కండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం నలభై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణరంగంలో నిర్మాణ రంగ పరికరాల అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి కంటైనర్ తయారీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ ఫైబర్ విధానందిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. జౌళిరంగ విస్తరణతో పాటు ఆధునికీకరణ, ఉపాధి దిశగా మరింతగా అడుగులు వేసేందుకు తమ ప్రయత్నం కొనసాగుతుందని నిర్మలమ్మ చెప్పారు.

పరిశ్రమలతో విద్యాసంస్థలను...
పరిశ్రమలకు విద్యాసంస్థలను అనుసంధానం చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మెగా టెక్స్ టైల్స్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తలిపారు. జౌళి ఉత్పత్తుల, అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో కొత్తగా ఇరవై జల మార్గాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా డెడికేటెడ్ఫ్రైట్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైలెవెల్ బ్యాంకింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్ చప్పారు. భారతీయ స్టాక్ మార్కెట్ లో పెట్టే పెట్టుబడులకు పరిమితికి పెంపునకు అవకాశమిస్తామని ప్రకటిచంారు.
ఏడు నగరాల మధ్య...
ఏడు నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ - బెంగళూరు మధ్య హైస్పీడ్ రైల్వే కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పూణె - హైదరాబాద్ , హైదరాబాద్ - బెంగళూరుల మధ్య ఈ హై స్పీడ్ కారిడార్ ను ఏర్పాటు చేస్తునట్లు ప్రకటించారు. ముంబయి - పూణె, హైదరాబాద్ - చెన్నై, ఢిల్లీ - వారణాసిల మధ్య హై స్పీడ్ కారిడార్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇన్ ఫ్రాక్చర్ స్ట్రక్చర్ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. బెంగాల్ నుంచి గుజరాత్ వరకూ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏఐ మిషన్ కు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. వారణాసి, పాట్నాలలో షిప్ రిపేర్ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.




Tags:    

Similar News