Nirmala Sitaraman : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మినహాయింపులివే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మూలధన వ్యయం 12.20 లక్షలకోట్ల రూపాయలుగా తెలిపారు. ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సూక్ష్మ తరహా పరిశ్రమలకు రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు నిర్మలమ్మ చెప్పారు. స్వయం సమృద్ధ భారత్ పేరుతో రెండు వేల కోట్ల ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎంఎస్ఎంఈలకు ప్రబుత్వం కొనుగోళ్ల ద్వారా చేయూతను అందిస్తుందని చెప్పారు. దేశంలో మూడు ఆయుర్వేద ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్ నగర్ లో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తునట్లు ప్రకటించారు.
వ్యవసాయ రంగానికి...
యువత కోసం వైద్య రంగంలో నూతన కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ప్రయివేటు రంగంలో పశువైద్య, డయాగ్నస్టిక్స్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రోత్సాహమందిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. చిన్న, సన్న కారు రైతులకు ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. మహిళల ద్వారా ప్రత్యేక షీ బజార్స్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తీర ప్రాంతంలో కొబ్బరి, గంధం చెట్ల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నామని నిర్మలమ్మ తెలిపారు.జీడిపప్పు, కోకో ల పంటకు ప్రత్యేక రాయితీలను ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. మౌలిక సదుపాయాల రంగంలో పనిచేసే కూలీలకు ఉపయోగపడే నిధులు కేటాయించనున్నామని చెప్పారు. జాతీయ జల రవాణా కార్యక్రమంలో భాగంగా తూర్పు - పశ్చిమాల అనుసంధానం చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
టెక్స్ టైల్స్ రంగం కోసం...
టెక్స్ టైల్స్ రంగం కోసం ఐదు సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ఎంచుకుందని తెలిపారు. టెక్స్ టైల్స్ రంగంకోసం రానున్న ఐదేళ్లలో పదివేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ డిజిటల్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పదిహేను పురావస్తు ప్రాంతాల అభివృద్ధిని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఖేలో ఇండియా మిషన్ లో భాగంగా క్రీడాభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి వస్తుందని చెప్పారు. ట్యాక్స్ నిబంధనలను సడలిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీసీఎస్ ఐదు నుంచి రెండు శాతానికి తగ్గిస్తున్నట్లు తెలపిారు. మోటార్ యాక్సిడెంట్ పన్ను చెల్లింపుపై పన్ను సడలింపు ఇస్తున్నట్లు నిర్మలమ్మ తెలిపారు.