Nirmala Sitaraman : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లో నిఫ్టీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

Update: 2026-02-01 07:10 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి వస్తుందని చెప్పారు. ట్యాక్స్ నిబంధనలను సడలిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. టీసీఎస్ ఐదు నుంచి రెండు శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. మోటార్ యాక్సిడెంట్ పన్ను చెల్లింపుపై పన్ను సడలింపు ఇస్తున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. సామాన్యులు సయితం ఐటీ రిటర్స్ ఫైల్ చేసేలా మార్పులు తీసుకు వస్తున్నామని తెలిపారు. సరళతరం చేసిన ఫారాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంతో స్టాక్ మార్కెట్లు కుప్ప కూలాయి. 2300 పాయింట్ల నష్టాలతో సెన్సెక్స్ నడుస్తుంది. 700 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ఉంది.

పన్ను రిటర్న్స్ దాఖలకు గడువు...
సవరించిన పన్ను రిటర్న్ ల దాఖలకు గడువు పెంచుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 31వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకూ పొడిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటిచంారు. విదేశీ యాత్రలపై పన్ను తగ్గిస్తున్నట్లు చెప్పారు. చదువులు, వైద్యం పై టీడీఎస్ ఐదు నుంచి రెండు శాతానికి తగ్గిస్తున్నామని చెపపారు. మ్యాన్ పవర్ సరఫరా చేసే సంస్థల కు ఒకటి లేదా రెండు శాతం టీడీఎస్ ఉంటుందని అన్నారు. చిన్న పన్ను చెల్లింపుదారులకోసం ప్రత్యేక పథకాన్ని తీసుకు వస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కార్పొరేట్ బైబాక్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. నాన్ కార్పొరేట్ బై బ్యాక్ కొనుగోళ్లపై ముప్ఫయి శాతం పన్ను విధిస్తున్నామని తెలిపారు. చిన్న మదుపరుల ప్రయోజనం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసకున్నారు.
డేటా సెంటర్ల ఏర్పాటు చేసే...
భారత్ లో డేటా సెంటర్ల ఏర్పాటు చేసే సంస్థలకు నిర్మలా సీతారామన్‌ తీపికబురు తెలిపారు. ట్యాక్స్ హాలిడే నిర్ణయంతో క్లౌడ్ సేవల సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 0.1 శాతం ద్రవ్యలోటు తగ్గిందన్న నిర్మలా సీతారామన్‌ 2026-2027 ద్రవ్యలోగు 4.3 శతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. క్యాన్సర్ రోగులకు ఉపయోగించే పదిహేడు ఔషధాలపై పన్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. సెంట్రల్ ఎక్సైజ్ నుంచి బయో గ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యే సీఎన్జీకి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. మైక్రో అవెన్స్ పై పన్ను తగ్గిస్తున్నట్లు తెలిపారు. పౌర విమానాల విడిభాగాల పన్నును తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు.
















Tags:    

Similar News