కర్నూలు జిల్లాలో మళ్లీ పగలు పడగ విప్పాయి. ఈదఫా టీడీపీ నేతను బీజేపీ లీడర్ టార్గెట్ చేసుకున్నారు. పాణ్యం పట్టణానికి చెందిన టీడీపీ నేత పుల్లారెడ్డిపై బీజేపీ నేత సుబ్బారాయుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. పుల్లారెడ్డి తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కత్తితో పొడిచిన సుబ్బారాయుడు వెంటనే పోలీసు స్టేషన్లోకి వెళ్లి లొంగిపోయాడు. కాగా ఐటీడీఏ నిధుల విషయంలోనే టీడీపీ, బీజేపీ నేతల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు తెలిసింది.