చైనాలో తెలుగుతేజం సింధు చరిత్ర సృష్టిస్తుందా?

Update: 2016-11-19 12:45 GMT

బ్యాడ్మింటన్ లో భారత ఖ్యాతిని ఒలింపిక్ యవనికపై సగర్వంగా నిలిపిన తెలుగుతేజం పీవీ సింధు.. తన హవాను కొనసాగిస్తోంది. జైత్రయాత్రను.. బ్యాడ్మింటన్ కు పెట్టింది పేరైన చైనాలోనే కొనసాగిస్తోంది. చైనా సూపర్ సిరీస్ ఓపెన్ టోర్నీలో సెమీస్ లోకి ఎంటరైనప్పుడే.. వార్తల్లోకి ప్రముఖంగా వచ్చిన సింధు, శనివారం నాటి ఆటలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ సెమీస్ మ్యాచ్ లో ఆమె దక్షిణ కొరియాకు చెందిన సుంగ్ జి హుయాన్ ను ఓడించింది సగర్వంగా ఫైనల్లోకి ప్రవేశించింది.

మూడు సెట్‌ల మ్యాచ్ లో తొలిసెట్ ను కోల్పోయినప్పటికీ.. పీవీసింధు కోలుకుని ఆ తర్వాత వరుస సెట్లలో పైచేయి సాధించడం విశేషం. తొలి సెట్ ను 11-21 తేడాతో సింధు కోల్పోయింది. అయితే రెండో సెట్ టైబ్రేకర్ వరకు వచ్చాక 23-21 తేడాతో నెగ్గింది. మూడో సెట్ లో స్పష్టమైన ఆధిక్యంతో 21-19 తేడాతో గెలిచి.. ఫైనల్లోకి అడుగుపెట్టింది. మూడుసెట్లపాటూ హోరాహోరీ సాగిన ఈ పోరాటం ఏకంగా 84 నిమిషాల పాటు సాగడం విశేషం.

ఫైనల్ లో పీవీ సింధు, చైనాకు చెందిన సున్ యూతో తలపడుతుంది.

Similar News