కన్నడసీమలో రాజ్యాంగసంక్షోభం తప్పదా?

Update: 2016-10-02 07:13 GMT

కన్నడ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడనుంది. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఒక వివాదంలో దేశంలోనే అత్యున్నతమైన సుప్రీం న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకూడదని నిర్ణయించడంతో.. ఇలాంటి పరిస్థితికి ఆస్కారం ఏర్పడుతోంది. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ... ఇలాంటి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా.. సుప్రీం తీర్పు ప్రకారం నడుచుకోవాలంటూ.. కాంగ్రెస్‌ పెద్దలు హెచ్చరించినా కూడా వారు పట్టించుకునేలా లేదు.

తమిళనాడు రాష్ట్రానికి తక్షణం అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ ఆదేశాలను కన్నడ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. అక్టోబరు 3న ఉభయ సభల సమావేశం ఏర్పాటుచేసి కొత్తగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వంభావిస్తోంది. తమిళనాడుకు నీటిని విడుదల చేసే విషయంలో కన్నడ రాష్ట్రంలో అన్ని పార్టీలూ దాదాపుగా ఒకటే కట్టుబాటుతో ఉన్నాయి.

అలాగే న్యాయపరమైన చిక్కులు, రాజ్యాంగ సంక్షోభం ముదరకుండా ఉండేందుకు, సుప్రీంలోనే రివ్యూ పిటిషన్‌ వేయాలని కూడా కన్నడ ప్రభుత్వం భావిస్తోంది. అన్ని పార్టీలు కలసికట్టఉగా కావేరీ నీటిని తమిళనాడుకు ఇచ్చే ఆలోచనను వ్యతిరేకిస్తుండడంత.. పరిస్థితి ముందుముందు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అర్థం కావడం లేదు.

Similar News