పెద్ద నోట్ల రద్దు తరువాత తొలిసారిగా ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు దృష్టి సారించారు. ముందుగా సినిమా పరిశ్రమ మీదనే తమ దృష్టి కేంద్రీకరించారు. బాహుబలి సినిమా నిర్మాతల ఇళ్ల మీద శుక్రవారం మధ్యాహ్నం ఐటీ దాడులు జరిగాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత తెలుగు రాష్ట్రాల్లో జరిగిన తొలి ఐటీ దాడులుగా జనం వీటి గురించి చర్చించుకుంటున్నారు.
పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో నల్ల కుబేరులు సొమ్ములు వైట్ మనీ కింద మార్చుకోవడానికి నానా పాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా పరిశ్రమ కు చెందిన పలువురు నల్ల డబ్బు విషయంలో ఏమి చేసుకోవాలో తెలియక సతమతం అవుతున్నట్లు పుకార్లు వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ లోని ఒక హీరో ఇంట్లో కూడా సుమారు 25 కోట్ల వరకు లెక్కల్లో లేని సొమ్ము ఉన్నట్లుగా కూడా పుకార్లు వచ్చాయి. ఎటూ డబ్బు మార్పిడికి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం నడుస్తూనే ఉన్నది గనుక, ఇంత తక్కువ వ్యవధిలో ఐటీ దాడులు ఉంటాయని ఎవరూ ఊహించలేదు.
అయితే తొలిదెబ్బ టాలీవుడ్ మీదనే పడింది. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్ల మీద ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎంతవరకు ఎలాంటి సొమ్ములు పట్టుకున్నారో వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు.
టాలీవుడ్ కు షాక్
ఒక పక్క టాలీవుడ్ మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో ఇరుకునపడితే మరో వైపు బడా నిర్మాతలపై ఐటి శాఖ కొరడా జులిపించింది. అసలే బడా నిర్మాతలు మోడీ ప్రకటనతో కుదేలై కక్కలేక మింగలేక చచ్చిపోతున్నారు. ఇక ఇప్పుడు ఉన్న బ్లాక్ మనీ ని ఎలా మార్చలాని తలపట్టుకున్నారు. అసలు ఉన్న బ్లాక్ మనీ అంతా దాదాపు 500 రూపాయిలు 1000 రూపాయల కట్టలే ఎక్కువగా ఉంటాయి. ఇక వాటిని మోడీ రద్దు చేసి వాటి స్థానే 2000 , 500 కొత్త నోట్లని ప్రవేశపెట్టాడు. ఇక వాటిని ఇంత లిమిట్ ప్రకారమే బ్యాంకులో డిపాసిట్ చేసుకుని వాటిని కూడా కొంచెం కొంచెం గా విత్ డ్రా చేసుకునే అవకాశం కలిపించించారు. ఇక ఎక్కువ గా డిపాజిట్ చేసిన వారి మీద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ మాత్రం ఆయా బడా అకౌంట్స్ మీద డేగ కన్ను వేసి పర్యవేక్షిస్తుంది.
ఇక ఐటి శాఖ ఎక్కువగా డిపాజిట్ చేసిన వారిమీదే కాకుండా బడా నిర్మాతలపై దృష్టి సారించింది. ఈ రోజు టాలీవుడ్ లో బాహుబలి చిత్రాన్ని నిర్మించిన బాహుబలి నిర్మాతలు శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లపై ఐటి శాఖ దాడులు చేయడం ఇండస్ట్రీలో సంచలనమే. మరి వారు బ్యాంకులో ఎక్కువ డిపాజిట్ చేశారా... లేక ఇంట్లో పెద్ద మొత్తం లో సొమ్ము ఉందని వారికి ఇంఫార్మేషన్ వెళ్లి వారిపై వారి ఇల్లు, ఆఫీస్ లపై దాడులు నిర్వహించిందా అనేది తెలియాల్సి వుంది. ఇక బాహుబలి పార్ట్ 1 తో ఈ నిర్మాతలు చాల సంపాదించారు కాబట్టి పార్ట్ 2 కి కూడా వీరు పెద్ద మొత్తం లో సినిమా బిజినెస్ జరిగివుండొచ్చని ఐటి శాఖ భావించి ఇలా దాడులు నిర్వహించిందా అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. ఈ పరిణామం మాత్రం టాలీవుడ్ ని పెద్ద షాక్ కి గురిచేసింది. ఇక చాలామంది బడా నిర్మాతలు ఈ దాడులతో ఒణికిపోతున్నారని టాక్.