Gold Price Today : ఏడాది చివర కూడా బంగారం ప్రియులను ఏడిపిస్తుందిగా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది

Update: 2025-12-23 03:40 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఎంత అనేదానికన్నా ఎంతో కొంత పెరుగుతూనే ఉండటం ఇటీవల కాలంలో జరుగుతుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగతూ కొనుగోలు చేద్దామని భావించే వారి ఆశలను అడియాసలు చేస్తున్నాయి. అందుకే బంగారం, వెండి విషయంలో పెద్దగా ఆసక్తి పెంచుకోవడం కూడా మంచిదికాదు. బంగారం ధరలు పెరుగుతాయే తప్ప తగ్గవు. ఈ వారం క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బంగారం, వెండి ధరలు కొంతగా తగ్గివస్తాయని మార్కెట్ నిపుణులు వేసిన అంచనాలు కూడా నిజం కావడం లేదు. అందుకే బంగారానికి దూరంగానే ఉంటే మేలన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది.

అందుబాటులో లేక...
బంగారం అంటే ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే వస్తువు. కానీ నేడు కొందరికి మాత్రమే అది సొంతమయ్యే అపురూపమైన వస్తువుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. బంగారాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు చేయాలంటే బ్యాంకు ఖాతాలో నిండుగా డబ్బులుండాలి. అలాగే అంతకు మించిన అవసరం కూడా ఉండాలి. అంతే తప్ప అలంకారం కోసం, మెడలో వేసుకుని తిరిగేందుకు బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారు మాత్రం బంగారం వైపు చూడటం లేదు. పెళ్లిళ్ల సీజన్ కూడా లేకపోవడంతో పాటు బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో ఈ ఏడాది బంగారం, వెండి వస్తువుల విక్రయాలు గణనీయంగా తగ్గాయని చెప్పాలి. గత ఏడాదితో పోలిస్తే అత్యంత తక్కువగా బంగారం కొనుగోలు చేశారు.
మరో వారం రోజులు...
ఈ ఏడాది ముగియడానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే వచ్చే ఏడాది కూడా బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,24,810 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరు 1,36,160 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,31,100 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.


Tags:    

Similar News