కామెడీ కి కూడా ఒక హద్దుండాలిగా.. లోకేశ్ కూడా చూసి నవ్వుకుని ఉంటాడు
రాయిటర్స్ సంస్థకు ఒక ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిష్టాత్మకమైన సంస్థ అది.
రాయిటర్స్ సంస్థకు ఒక ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిష్టాత్మకమైన సంస్థ అది. అనేక మీడియా సంస్థలు రాయిటర్స్ వార్తలపై ఆధారపడి ఉంటాయి. అలాంటి రాయిటర్స్ లో వచ్చిన కథనం మాత్రం కేవలం వీక్షకులు, ప్రజలకు మాత్రమే కాదు.. రాజకీయ పార్టీలను సయితం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయబోతున్నారట.. అందుకు తర్వాత టెర్మ్ కు ఆయనకు 79 ఏళ్ల వయసు వస్తుందట. అందులోనూ నాలుగో సారి ఆయన ప్రధాని పదవికి అనర్హుడని ఆర్ఎస్ఎస్ భావిస్తుందట. అందుకోసం ఇప్పుడు 2026నాటికి రాజీనామా చేస్తే.. దేశానికి కొత్త ప్రధాని వస్తున్నారని రాయిటర్స్ లో జర్నలిస్ట్ శ్రితమ్ బోస్ వండి వార్చిన ఒక కథనం... రాయిటర్స్ నే నవ్వుల పాలు చేసింది. అయితే కథనం రూపంలో కాకుండా వీడియో రూపంలో ఈ వివరాలను దేశ ప్రజలముందుంచారు.
మోదీ రాజీనామాకు...
ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నేతలను కూడా సూచించడం విశేషం. తదుపరి ప్రధానిగా దేవేంద్ర ఫడ్నవిస్ కావచ్చు. అని కథనంలో చెప్పించారు. అమిత్ షా పేరు ... ఫడ్నవిస్ పేరు ఉంది. యోగి ఆదిత్యానాధ్ పేరు వినిపించలేదు. అదే సమయంలో ఎవరూ అంచనాలు వేయని విధంగా ప్రధాని మోదీ తర్వాత ఆ పదవిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టవచ్చన్న అంచనా వేసింది. చంద్రబాబు నాయుడు అంటే దాదాపు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. నాలుగు దఫాలు ముఖ్యమంత్రి... ఇలా అనేక ట్యాగ్ లైన్లు ఉండటంతో అంత వరకూ ఓకే. ఎన్డీఏ సంకీర్ణంలో భాగంగా చంద్రబాబు పేరును చొప్పించి ఉండవచ్చవని భావించవచ్చు.
చంద్రబాబు సరే...లోకేశ్ పేరుకు లాజిక్కేంటంటే?
కాని చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాలను వదిలి దేశ రాజకీయాలకు ప్రస్తుత మున్న పరిస్థితుల్లో వెళతారని ఎవరూ అనుకోరు. సరే వెళ్లారనుకున్నా.. అంతవరకూ ఓకే అయినా నారా లోకేశ్ పేరు చెప్పడంతోనే ఈ కథనం మొత్తం కామెడీ ట్రాక్ లో కూరుకుపోయిందని చెప్పాలి. ఎందుకంటే నారా లోకేశ్ పేరు ప్రధాని పదవిలో చేర్చడానికి ఈ సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన స్టోరీ మరింత ఆకట్టుకునేలా ఉంది. నారా లోకేశ్ విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు కాబట్టి ఆయన పేరును ప్రధాని పదవికి పరిశీలిస్తున్నారని చెప్పడం మరింత నవ్వులు పూయించింది. ఈ కథనం చూసి నారా లోకేశ్ కూడా బిగ్గరగా నవ్వుకుని ఉంటాడు. అసలు ఈ కథనం ఎలా వచ్చిందన్న దానిపై బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఆరా తీస్తుందట.
ప్రధాని కార్యాలయం కూడా...
మరొకవైపు ఇప్పటికే బీజేపీ 2029 నాటిఎన్నికలకు కూడా ప్రధానిగా నరేంద్ర మోదీ నేతృత్వంలో వెళతామని ప్రకటించింది. మోదీ చరిష్మా ఇసుమంతైనా తగ్గలేదు. బీహార్, ఢిల్లీ వరసగా అన్ని రాష్ట్రాలు గెలుస్తూ వస్తున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో కొంత సీట్లు తగ్గినా తర్వాత జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మోదీ హవా పనిచేసింది. ఈ సమయంలో మోదీ రాజీనామా ఎందుకు చేస్తారన్న ప్రశ్న అందరి నుంచి ఎదురవుతుంది. అసలు బిజినెస్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎనలిస్ట్ గా మారి ఒక్కసారి ప్రధాని మోదీని పదవి నుంచి తప్పించడం పై ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ కథనం వెనక ఎవరున్నారన్న దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద ఈ కథనాన్ని ప్రసారం చేసి రాయిటర్స్ తన పరువును మొత్తం పోగొట్టుకున్నట్లయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు రాయిటర్స్ ను ఏకిపారేస్తున్నారు.