ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలపడుతుందట. ఈ మాట అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ...తెలుగుదేశం పార్టీ అధినేత...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శనివారం ఆయన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో కాంగ్రెస్ బలపడుతున్నట్లు తనకు సర్వేల ద్వారా తెలిసిందని చెప్పారు. గతంతో పోలిస్తే రెండు శాతం బలపడినట్లు సమాచారం ఉందన్నారు. అయితే వైసీపీ మాత్రం ఏపీలో బలహీనపడిందని బాబు చెప్పేశారు. జన్మభూమి కమిటీలు సమర్ధవంతంగా పనిచేసేలా కృషి చేయాలని బాబు సమావేశంలో సూచించారు. వైసీపీ బలహీన పడిందని కాలర్ ఎగరేవయవద్దని....నిరంతరం క్యాడర్ ను, ఓటు బ్యాంకును కాపాడుకోవాలని ఆయన నేతలకు హితవు చెప్పారు.