ఆర్డినెన్స్ కు ఆమోదం

Update: 2016-12-28 07:51 GMT

కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. నోట్ల రద్దుపై ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. మార్చి 31వ తర్వాత పాత నోట్లతో లావాదేవీలు జరిపితే నాలుగేళ్లు జైలు శిక్ష, ఐదు వేల జరిమానా విధిస్తారు. డిసెంబరు 31వ తేదీ తర్వాత రిజర్వ్ బ్యాంకు కార్యాలయాల్లో పాత నోట్లను మార్చుకునే అవకాశం కేంద్రం కల్పించింది. కేవైసీ ఇచ్చి పాత నోట్లను మార్చుకోవచ్చు. ఈ అవకాశం మార్చి 31వ తేదీ వరకూ మాత్రమే ఉంది. తర్వాత మాత్రం పాత నోట్లు ఉంటే వారికి జరిమానాతో పాటు శిక్ష కూడా పడేలా ఆర్డినెన్స్ ను రూపొందించారు. ఈ ఆర్డినెన్స్ కు కేంద్ర మంత్రి వర్గం ఈరోజు ఆమోదించింది.

Similar News