Gold Price Today : బంగారం ధరలు దిగిరానున్నాయా? మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. భారీగా వెండి ధరలు తగ్గాయి.
బంగారం ధరలకు రెక్కలున్నట్లున్నాయి. పెరగడమే తప్పించి తగ్గడం అనేది అరుదుగా ఉంటుంది. అదే సమయంలో వెండి ధరలు కూడా విపరీతంగా పెరగడం ఆందోళనకు దారి తీస్తుంది. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది బంగారం ప్రియులకు ఎంత చేదుగా నిలిచిందో అంతకంటే ఎక్కువగా వచ్చే కొత్త ఏడాది కూడా నిలుస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అంటే బంగారం ధరలు తగ్గే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే బంగారం విషయంలో ధరలు ఎప్పుడూ అంతేనని చెబుతున్నారు. ధరలు కొంతగా తగ్గుతున్నప్పుడే కొనుగోలు చేయాలని, వేచి చూడాలనుకుంటే నిరాశ తప్పదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఆసక్తి చూపకపోయినా...
బంగారం విషయంలో ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోవడం మానేశారు. ఎందుకంటే కొనుగోలు చేయని వస్తువుపై ఆసక్తి కూడా చూపడం మానేశారు. దీంతో పాటు బంగారానికి ప్రత్యామ్నాయ వస్తువులను కొనుగోలు చేయడం అలవాటు వేసుకున్నారు. బంగారాన్ని ఇక కొనుగోలు చేయలేమని ఫిక్స్ అయిపోయిన చాలా మంది తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతోనైనా ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు చూస్తున్నారు. ఏ రకంగా చూసినా బంగారం కొనుగోలు చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. డిమాండ్ లేనంత మాత్రాన ధరలు పతనం మాత్రం కావడం లేదు. ప్రతిరోజూ ధరలు పెరుగుతుండటంతో దానిపై ఇష్టాన్ని కూడా బలవంతంగా చంపేస్తున్నారు.
నేటి ధరలు...
పెళ్లిళ్ల సీజన్ కూడా లేకపోవడంతో బంగారం ధరలు మరింత తగ్గుతాయని భావించిన వారికి నిరాశ ఎదురయింది. ఎందుకంటే ధరలు పెరుగుతున్నా, డిమాండ్ లేకున్నా కొనుగోళ్లు మాత్రం నిలిచిపోయాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. భారీగా వెండి ధరలు తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,22,740 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,33,900 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి దర 2,09,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు పెరిగే అవకాశముంది.