వారిపై చర్యలు తీసుకోండి… జగన్ ఆదేశం

కరోనా సోకి మరణంచిన వ్యక్తి అడ్డుకోవడం అమానవీయమని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లాలో ఒక వ్యక్తి కరోనాతో మరణిస్తే అంత్యక్రియలను స్థానికులు అడ్డుకోవడంపై జగన్ ఆవేదన [more]

Update: 2020-04-30 07:50 GMT

కరోనా సోకి మరణంచిన వ్యక్తి అడ్డుకోవడం అమానవీయమని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లాలో ఒక వ్యక్తి కరోనాతో మరణిస్తే అంత్యక్రియలను స్థానికులు అడ్డుకోవడంపై జగన్ ఆవేదన చెందారు. కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జగన్ డీజీపీని ఆదేశించారు. కరోనా వచ్చిన వారిని అంటరాని వారిగా చూడటం మానుకోవాలని కోరారు. ఇలా అడ్డుకునే వారికి రేపు అదే పరిస్థితి రావచ్చన్నారు. అంత్యక్రియలను అడ్డుకుంటే ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా సోకిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వారిని అంటరానివారిగా చూడటం దురదృష్టకరమన్నారు.

Tags:    

Similar News