బ్రేకింగ్ : జగన్ ఆశలపై నీళ్లు చల్లారే

ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని ఆపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. [more]

Update: 2020-03-14 07:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని ఆపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజానికి రాష్ట్రంలోని 26 లక్షల మంది పేదలకు ఉగాది రోజున పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్థలాల సేకరణ, లబ్దిదారుల ఎంపికను కూడా జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని నిలిపేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఉగాది రోజున స్థలాలను పేదలకు పంపిణీ చేయాలన్న జగన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

Tags:    

Similar News