తొలిసారి జగన్ రెస్పాండ్ అయ్యారు

ఎన్పీఆర్ పై సవరణలను కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు. ఎన్పీఆర్ పై పార్టీలో చర్చించామని, అవసరమైతే మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరతామని జగన్ [more]

Update: 2020-03-03 12:38 GMT

ఎన్పీఆర్ పై సవరణలను కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు. ఎన్పీఆర్ పై పార్టీలో చర్చించామని, అవసరమైతే మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరతామని జగన్ తెలిపారు. ఎన్పీఆర్ లోనూ కొన్ని అంశాలు ముస్లింలను అభద్రతాభావానికి గురి చేస్తున్నాయని జగన్ అభిప్రాయపడ్డారు. ఎన్పీఆర్ పై జగన్ తాజగా ట్వీట్ చేశారు. మైనారిటీలు అభద్రతా భావానికి గురికాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎన్పీఆర్ పై సవరణలు కోరుతూ తీర్మానం చేస్తామని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో తొలిసారి జగన్ ఎన్పీఆర్ పై స్పందించారు. మైనారిటీల మనోభావాలకు అనుగుణంగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు.

Tags:    

Similar News