జగన్ “దిశ” ప్రారంభం

రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ను ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మహిళలపై దాడులు, [more]

Update: 2020-02-08 05:51 GMT

రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ను ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మహిళలపై దాడులు, అత్యాచారాలను నిరోధించడానికి జగన్ ప్రభుత్వం దిశ చట్టాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. చట్టం పకడ్బందీగా అమలు చేయడానికి ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తో కలసి హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే ఆర్కే రోజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ తెచ్చిన దిశ చట్టం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News