బ్రేకింగ్: జగన్ మరో అడుగు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల న్యాయ సంబంధిత శాఖలను కర్నూలుకు తరలించిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోని [more]

Update: 2020-02-03 07:57 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల న్యాయ సంబంధిత శాఖలను కర్నూలుకు తరలించిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మిలీనియం టవర్స్ లోని బి టవర్ నిర్మాణానికి ప్రభుత్వం 19. 73 కోట్లు నిధులు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిలీనియం టవర్స్ నుంచే సచివాలయం కార్యకలాపాలను ప్రభుత్వం నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో నిధుల విడుదల చర్చనీయాంశమయింది. ఐటీ శాఖకు ఈ నిధులను విడుదల చేసింది.

Tags:    

Similar News