కోవిడ్ తో సహజీవనం చేయక తప్పదు
కోవిడ్ తో సహజీవనం చేయక తప్పదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వ్యాక్సిన్ అందరికీ అందేవరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని [more]
కోవిడ్ తో సహజీవనం చేయక తప్పదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వ్యాక్సిన్ అందరికీ అందేవరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని [more]
కోవిడ్ తో సహజీవనం చేయక తప్పదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వ్యాక్సిన్ అందరికీ అందేవరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. దేశంలో రెండు కంపెనీలే వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయని, పూర్తి స్థాయిలో ఏపీ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే మరింత సమయం పడుతుందని జగన్ తెలిపారు. ఏపీకి ఏడు కోట్ల డోసులు అవసరమని, అయితే ఇప్పటివరకూ 75 లక్షల డోసులే వచ్చాయని జగన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. వైెఎస్ఆర్ రైతు భరోసా కింద జగన్ రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని జగన్ చెప్పారు. కరోనాతో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రైతన్నలకు సాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు.