IPL Auction : ఎవడ్రా ఈ కుర్రోడు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. గూగుల్ నే షేక్ చేస్తున్నాడుగా?

ప్రశాంత్ వీర్.. ఇప్పుడు క్రికెట్ చరిత్రలో ఒక్కసారిగా దేశంలో పేరు మారుమోగిపోతుంది

Update: 2025-12-17 02:23 GMT

ప్రశాంత్ వీర్.. ఇప్పుడు క్రికెట్ చరిత్రలో ఒక్కసారిగా దేశంలో పేరు మారుమోగిపోతుంది. ఇప్పటి వరకూ వార్తల్లో లేని ప్రశాంత్ వీర్ ను చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక ధరకు చేజిక్కించుకుంది. నిన్న జరిగిన ఐపీఎల్ వేలంలో అన్ కాప్డ్ ఆటగాళ్లలో ప్రశాంత్ వీర్ అత్యధిక ధర పలకడం విశేషం. అబుదాబిలో జరిగిన వేలంలో అత్యధిక ధర పలికిన అన్ క్యాప్డ్ ఆటగాడిగా ప్రశాంత్ వీర్ పేరును గూగుల్ లో అత్యధికంగా చెక్ చేస్తున్నారు. ప్రశాంత్ వీర్ ను చెన్నై సూపర్ కింగ్స్ 14,20 కోట్ల రూపాయలతో సొంతం చేసుకుంది.

యూపీకి చెందిన...
ఇంతకీ ప్రశాంత్ వీర్ ఎవరంటే.. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన యువకుడు. నిండా ఇరవై ఏళ్లు కూడా లేవు. 20226 ఐపీఎల్ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికి ప్రశాంత్ వీర్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ను షేక్ చేస్తున్నాడు. ప్రశాంత్ వీర్ కేవలం ముప్ఫయి లక్షల ధరతో వేలంలోకి వచ్చాడు. కానీ ప్రశాంత్ వీర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ప్రశాంత్ వీర్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ 14.20 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.
అత్యంత ధర పలికిన...
అయితే ఇప్పటి వరకూ ఐపీఎల్ చరిత్రలో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా అత్యధిక ధర పలికిన ఆటగాడుగా ప్రశాంత్ వీర్ రికార్డును క్రియేట్ చేశాడు. మరొక ప్లేయర్ కార్తీక్ శర్మ కూడా ఇదే తరహాలో 14.20 కోట్లకు చేజిక్కించుకుంది. ప్రశాంత్ వీర్ పూర్తి పేరు ప్రశాంత్ రామేంద్ర వీర్. ఉత్తర్ ప్రదేశ్ లోని అమేధీలో నవంబర్ 27 2005లో జన్మించాడు. దిగువ మధ్యతరగతి కుటుంబమైనా క్రికెట్ అంటే ఆసక్తితో బ్యాట్ చేతపట్ాడు. అలాగే స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. అంటే ప్రశాంత్ వీర్ ఆల్ రౌండర్. మొత్తం మీద గూగుల్ లో నిన్నటి నుంచి ప్రశాంత్ వీర్ కోసం అత్యధిక మంది సెర్చ్ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ తరుపున దేశవాళీ క్రికెట్ ఆడిన ప్రశాంత్ వీర్ ఆల్ రౌండర్. అండర్ 23 క్రికెట్ లనూ యూపీ తరుపున ఆడి పది వికెట్లు పడగొట్టడంతో ఇంత డిమాండ్ పెరిగింది.


Tags:    

Similar News