వాలంటీర్లకు మరో వరాన్ని ప్రకటించిన జగన్
వాలంటీర్లు నిస్వార్థంగా సేవలందిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వాలంటీర్లలో 55 శాతం మంది యువతులు అయినందుకు గర్వంగా ఉందన్నారు. విజయవాడలోని పోరంకిలో వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో [more]
వాలంటీర్లు నిస్వార్థంగా సేవలందిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వాలంటీర్లలో 55 శాతం మంది యువతులు అయినందుకు గర్వంగా ఉందన్నారు. విజయవాడలోని పోరంకిలో వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో [more]
వాలంటీర్లు నిస్వార్థంగా సేవలందిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వాలంటీర్లలో 55 శాతం మంది యువతులు అయినందుకు గర్వంగా ఉందన్నారు. విజయవాడలోని పోరంకిలో వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా సేవలందిస్తున్నారని వాలంటీర్లను జగన్ కొనియాడారు. వాలంటీర్ల సేవలను గుర్తించి సేవారత్న, సేవామిత్ర అవార్డులను ఇస్తున్నామని జగన్ చెప్పారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం అర్హులైన లబ్దిదారులకు వాలంటీర్ల ద్వారానే చేరుతుందన్నారు. ఈ అవార్డుల కోసం 241 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ప్రతి ఏడాది ఇదే విధంగా సత్కరిస్తామని జగన్ చెప్పారు. వాలంటీర్లలో పోటీతత్వం పెంచేందుకే ఈ అవార్డులను ప్రకటించామని చెప్పారు. నేటి నుంచి ప్రతి జిల్లాలో రోజు ఒక నియోజకవర్గంలో అవార్డుల ప్రదానం ఉంటుందని చెప్పారు. తాను మూడు ప్రాంతాల్లో పర్యటించి అవార్డులను ప్రదానం చేస్తానని జగన్ చెప్పారు. సేవాభావంతో పనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్థను ఎల్లోమీడియా, విపక్షాలు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. మీరు క్రమశిక్షణతో మెలిగినంత కాలం ఏ విమర్శలకు భయపడవద్దని జగన్ వాలంటీర్లకు హితబోధ చేశారు. విమర్శలు చేసే వారి పాపానికి వారినే వదిలేద్దామన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ వాలంటీర్లకు భరోసా ఇచ్చారు.