జగన్ ఈ ఎన్నిక ప్రచారంలోనూ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండానే క్లీన్ స్వీప్ చేశారు. తిరుపతి [more]

Update: 2021-04-04 01:37 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండానే క్లీన్ స్వీప్ చేశారు. తిరుపతి ఉప ఎన్నిక బాధ్యతలను కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు జగన్ అప్పగించారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలోనూ జగన్ పాల్గొనే అవకాశం తక్కువగానే కన్పిస్తుంది. తాను ప్రచారం చేయకపోయినా తాను అమలు చేస్తున్న పథకాలే తన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయన్న నమ్మకంతో జగన్ ఉన్నట్లు కన్పిస్తుంది. ఈనెల 15వ తేదీ వరకూ మాత్రమే తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం ఉంది. మరి జగన్ ప్రచారానికి వస్తారా? రారా? అన్నది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News