చివరి రోజు జగన్ వస్తున్నందున?

ఏపీ ముఖ్యమంత్రి ఈ ఏడాది చివరి రోజున సచివాలయానికి వస్తుండటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సచివాలయానికి వెళ్లే దారిలో ఉన్న గ్రామాల్లో నిరసనలు, ఆందోళనలకు [more]

Update: 2019-12-31 04:24 GMT

ఏపీ ముఖ్యమంత్రి ఈ ఏడాది చివరి రోజున సచివాలయానికి వస్తుండటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సచివాలయానికి వెళ్లే దారిలో ఉన్న గ్రామాల్లో నిరసనలు, ఆందోళనలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లే దారిలో ఉన్న దుకాణాలన్నింటినీ పోలీసులు మూసివేయిస్తున్నారు. మరోవైపు నేడు పవన్ కల్యాణ్ ఈరోజు రైతులకు సంఘీభావం తెలపనున్నారు. ఉదయాన్నే పవన్ కల్యాణ్ ఇక్కడికి రావాల్సి ఉండగా ఆంక్షలు ఉండటంతో జగన్ సచివాలయానికి వెళ్లేవరకూ తన పర్యటనను పవన్ కల్యాణ్ వాయిదా వేసుకున్నారు. సంవత్సరం చివరి రోజు కావడంతో జగన్ సచివాలయానికి వచ్చి మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నారు. మందడం గ్రామంలో పోలీసులు భారీగా మొహరించారు. పోలీసులు తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News