మధ్యతరగతి ప్రజలపై జగన్ వరాలు

మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్నారు. లాభాపేక్ష లేకుండా చౌక ధరలకు మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2021-02-16 01:13 GMT

మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్నారు. లాభాపేక్ష లేకుండా చౌక ధరలకు మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ టౌన్ షిప్ లను నిర్మించాలని జగన్ నిర్ణయించారు. పట్టణ ప్రణాళిక అమలుపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా తక్కువ ధరలకు మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లు ఇచ్చేలా ప్రణాళికలను రపొందించాలన్నారు. పట్టణాల్లోని రింగురోడ్ల నిర్మాణం చేపట్టాలని, వీటి చుట్టూ స్మార్ట్ టౌన్ షిప్ లను నిర్మించాలని జగన్ సూచించారు. తొలుత ప్రయోగాత్మకంగా 12 పట్టణాల్లో 18 లే అవుట్లను సిద్ధం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News