పోలవరానికి జగన్

పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 14వ తేదీన రానున్నారు. ఆయన ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో సమీక్షిస్తారు. 2021 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు [more]

Update: 2020-12-12 02:46 GMT

పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 14వ తేదీన రానున్నారు. ఆయన ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో సమీక్షిస్తారు. 2021 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే గడువు దగ్గరపడుతున్న సమయంలో జగన్ పోలవరం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు వద్దనే జగన్ అధికారులతో సమీక్షించనున్నారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశాలు జారీ చేయనున్నారు.

Tags:    

Similar News