జగన్ అర్జంట్ గా హైదరాబాద్ కు...!

Update: 2018-05-20 02:59 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు ఈరోజు విరామమిచ్చి హైదరాబాద్ బయలుదేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు మృతి చెందడంతో జగన్ దిగ్భ్రాంతి చెందారు. సోమయాజులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సలహాదారుగా సేవలందించారు. బడ్జెట్ లు ప్రవేశపెట్టినప్పుడు జగన్ సోమయాజుల సలహాలు తీసుకునే వారు. సోమయాజులు గత కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున మృతి చెందారు. దీంతో జగన్ పాదయాత్రను, బహిరంగ సభను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. జగన్ ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

Similar News