పరిశ్రమ చరిత్ర పెద్దదే అయినా?

విశాఖపట్నంలో ప్రమాదానికి కారణమైన పరిశ్రమకు దాదాపు యాభై ఏళ్ల చరిత్ర ఉంది. 1961లో హిందుస్థాన్ పాలిమర్స్ పేరుతో ఈ పరిశ్రమను విశాఖలో ప్రారంభించారు. అప్పట్లో చుట్టుపక్కల గ్రామాలు [more]

Update: 2020-05-07 05:25 GMT

విశాఖపట్నంలో ప్రమాదానికి కారణమైన పరిశ్రమకు దాదాపు యాభై ఏళ్ల చరిత్ర ఉంది. 1961లో హిందుస్థాన్ పాలిమర్స్ పేరుతో ఈ పరిశ్రమను విశాఖలో ప్రారంభించారు. అప్పట్లో చుట్టుపక్కల గ్రామాలు లేవు. 1978లో ఈ కంపెనీని యూబీ గ్రూప్ టేకోవర్ చేసింది. 1997లో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ గ్రూపు ఈ కంపెనీని తీసుకుని ఎల్జీ పాలిమర్స్ గా మార్చింది. ఎల్పీ పాలిమర్స్ ఏర్పాటయి. దాదాపు 23 ఏళ్లు గడుస్తుంది. గతంలో విశాఖకు దూరంగా ఉన్న ఈ పరిశ్రమ సిటీ విస్తరించడంతో గ్రామాల మధ్యకు పరిశ్రమ చేరుకుంది. మొన్నటి వరకూ లాక్ డౌన్ తో ఈ పరిశ్రమ మూత పడింది. మినహాయింపుల్లో భాగంగా నిన్ననే పరిశ్రమ ఓపెన్ అయింది. ఈ దుర్ఘటన జరిగింది. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం ప్రమాద హెచ్చరికలు కూడా ఇవ్వలేదని, సైరన్ కూడా మోగలేదని స్థానికులు చెబుతున్నారు. పరిశ్రమ చరిత్ర పెద్దదే అయినా నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.

Tags:    

Similar News