IPL 2024 : బ్యాడ్ లక్ ను భుజనా వేసుకుని తిరుగుతున్నట్లే కనిపించిందిగా

ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత దురదృష్టం వెంటాాడిన జట్టు రాజస్థాన్ రాయల్స్ అని చెప్పవచ్చు.

Update: 2024-05-25 03:08 GMT

ఐపీఎల్ లో ఎవరు మొనగాడు కాదు.. ముందు బ్యాట్ ఊపి ఇరగదీసిన వాళ్లు.. తర్వాత చేతులెత్తేసిన జట్లను అనేకం చూశాం. ఇప్పుడు ఆ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ చేరింది. ఎవరూ ఊహించకుండా ఇంటి దారి పట్టింది. బ్యాడ్ లక్ భుజనా వేసుకుని తిరుగుతున్నట్లే కనిపించింది. ఎందుకంటేరాజస్థాన్ రాయల్స్.. ఈ ఐపీఎల్ సీజన్ లో ఎంతగా దూసుకు వచ్చిందో.. అలా చివరకు చెన్నై మైదానంలో బలయిపోయింది. తొలి నుంచి పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్రభాగానే నిలిచింది. ప్రతి జట్టుపై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో చాలా రోజుల పాటు అది నిలవడంతో ప్లే ఆఫ్ కు చేరడం ఖాయమని అప్పుడే ఫిక్స్ అయిపోయారు.

ముగింపు దశకు వచ్చేసరికి...
అలాగే జరిగింది. కానీ లీగ్ మ్యాచ్ లు ముగింపు దశకు వచ్చే సరికి ఆ జట్టు ఎందుకో డీలా పడినట్లే కనిపించింది. మంచి హిట్టర్లు, బౌలర్లున్న జట్టుగా ఈ ఏడాది చాంపియన్ గా జట్టును ప్రతి ఒక్కరూ అంచనా వేశారు. కోల్్కత్తా నైట్ రైడర్స్ కూడా అంతే దూకుడుగా ఉండటతో ఈ రెండు జట్లే ఫైనల్స్ లో తలపడతాయని ప్రతి ఒక్కరూ ఎక్స్ పెక్ట్ చేశారు. అంచనాలుకు తగినట్లుగానే ఆడినా.. చివరి దశలో అది చేతులెత్తేసినట్లే కనిపించింది. యశస్వి జైశ్వాల్ లక్కీ లాటరీగా మారిపోయాడు. సంజూ శాంసన్ కూడా అంతే ఎప్పుడు రాణిస్తాడో అతడికే తెలియని పరిస్థితి. ఇక పరాగ్ ఒక్కడే ఈ సీజన్ లో నిలకడగా ఆడుతూ జట్టుకు అనేక విజయాలను అందించాడు.
హిట్టర్లు అనేక మంది...
మార్ క్రమ్, హిట్ మమర్ వంటి వాళ్లు కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఎందుకో ఈసీజన్ మాత్రం రాజస్థాన్ రాయల్స్ కు కలసి రాలేదు. బెంగళూరు జట్టు మీద తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ ను సునాయసంగా సొంతం చేసుకున్న ఆ జట్టు చివరి క్వాలిఫయర్ లో మాత్రం చాపచుట్టేసింది. అంటే అదృష్టం వారి వెంట లేదనే చెప్పాలి. మైదానంలో ఆరోజు ఎవరు ఆడితే వారిదే విజయం. ఆ సూత్రం తెలిసిన ఆ జట్టు చివరలో సమిష్టిగా ఫ్లాప్ ముద్ర వేసుకుని మరీ ఇంటి దారి పట్టింది. కానీ మంచి జట్టు.. సంజూశాంసన్ వంటి కూల్ కెప్టెన్ ఉన్న ఆ జట్టు ఈసారి ఫైనల్స్ కు చేరుకుని ఖచ్చితంగా కప్పు కొడుతుందని భావించినా... బ్యాడ్ లక్ .. చివరకు అది సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలయింది. ఈ సీజన్ లో అత్యంత బ్యాడ్ లక్ బ్యాచ్ ఏదైనా ఉందంటే రాజస్థాన్ రాయల్స్ అని చెప్పక తప్పదు. మరి వచ్చే సీజన్ లోనైనా రాణించాలని ఆశిద్దాం.


Tags:    

Similar News