Gold Rates Today : నిలకడగా ఉన్నాయని భావిస్తే తప్పులో కాలేసినట్లే.. రేపు చూడండి మరి

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.

Update: 2024-05-26 03:12 GMT

బంగారం ధరలు ఎప్పటికీ దిగిరావు. వీలుంటే పరుగులు పెట్టడమే కాని దానికి వెనక్కు వెళ్లడం అనేది అస్సలు తెలియదు. అప్పుడప్పుడు ఆగి అలా విశ్రాంతి తీసుకుంటుంది. దానిని చూసి ధరలను తగ్గుతాయని భావిస్తే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే బంగారం ధరలు ఎప్పటికీ తగ్గవు. పెరగడం దానికి తెలిసినంత మరే వస్తువుకూ తెలియదు. భూముల ధరలన్నా అప్పుడప్పుడూ నేలచూపులు చూస్తుంటాయి కానీ బంగారం మాత్రం తలెత్తుకుని పరుగులు తీస్తూనే ఉంటుంది. ఎందుకంటే.. దానికి ఉన్న డిమాండ్ అలాంటిది.

కారణాలు ఏవైనా?
ఇక పెళ్లిళ్ల సీజన్ లో బంగారం, వెండి ధరలను అదుపు చేయడం ఎవరి వల్లా కాదు. దూసుకు పోతూనే ఉంటాయి. అయితే సంప్రదాయం ప్రకారం కొనుగోలు చేయాల్సి రావడంతో తప్పని సరి పరిస్థితుల్లో బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డిమాండ్ కు తగినంత బంగారం నిల్వలు లేకపోవడం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణాలుగా చెబుతుంటారు.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. అయితే దీనిని చూసి ధరలు తగ్గుతాయని భావిస్తే మాత్రం పొరపాటు పడినట్లేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,400 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,440 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 96,000 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News