Gold Rates Today : వావ్.. ఇది నిజమా? బంగారం ధరలు ఇంత తగ్గాయా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి

Update: 2024-05-25 01:57 GMT

నిజంగా బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. అయితే తగ్గితే మాత్రం స్వల్పంగానే తగ్గుతూ కొనుగోలుదారులను నిరాశలోకి నెట్టాయి. అయితే తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వేల రూపాయల వరకూ తగ్గడమంటే మామూలు విషయం కాదు. అలాగే వెండి ధరలు కూడా నేల చూపులు చూశాయి. ఎలాగంటే కిలో వెండి ధర పై నిన్న రాత్రి నాలుగువేల రూపాయల వరకూ తగ్గింది. ఇంత భారీ స్థాయిలో బంగారం ధరలు ఎప్పుడూ తగ్గలేదు. వెండి ధరలు కూడా లక్ష దాటిన తర్వాత తిరిగి తిరోగమనం పట్టడం అదృష్టమే.

కొనుగోలు చేయడమే...
బంగారం, వెండి అంటే ఇష్టపడని వారు ఉండరు. ఈ రెండింటిని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. ఇందుకు పేద నుంచి ధనిక వరకూ తేడా లేదు. పేద, సామాన్యులకు ఇటీవల బంగారం, వెండి ధరలు అందకుండా పోయాయి. సీజన్ కాకపోయినా ధరలు పెరుగుతుండటంతో ఇక తులం బంగారం ఎనభై వేలు చేరుతుందన్న అంచనాలు కూడా బాగా వినించాయి. మార్కెట్ నిపుణులు కూడా అదే అంచనా వేసి ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని సూచించారు. అయితే బంగారం, వెండి ధరలు ఇలా దిగి రావడం చాలా వరకూ మదుపరులకు ఊరట కల్గించే అంశంగానే చెప్పుకోవాలి.
ఈరోజు ధరలు...
బంగారం, వెండి ధరలు ఎప్పుడూ పెరగడమే కాని, తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. భారీగా ధరలు పెరుగుతాయన్న అంచనాలకు భిన్నంగా నేడు ధరలు తగ్గడం శుభసూచకమేనని అంటున్నారు. ఇప్పుడు కొనుగోలుదారులు కళ్లుమూసుకుని బంగారం, వెండిని కొనుగోలు చేయొచ్చని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,390 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,430 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 92,400 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News