Remal Cyclone : తుపాను దూసుకొస్తుంది... అప్రమత్తంగా ఉండాల్సిందేనా?

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి రెమాల్ గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే

Update: 2024-05-26 01:56 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి రెమాల్ గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రికే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపాను గా బలపడింది. దీంతో పశ్చిమబెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ అధికరులు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని ఖెపుపరా కు నైరుతి దిశలో, పశ్చిమ బెంగాల్ కు చెందిన సాగర్ దీవులకు ఆగ్రేయంగా కేంద్రీకతమై ఉందని వాతావరణ శాఖ అధకారులు తెలిపారు.

తీవ్ర తుపానుగా మారి...
ఈరోజు ఉదయానికి తీవ్ర తుపానుగా మారనుంది. అయితే ఇది ఈరోు రాత్రికి బంగ్లాదేశ్ లో తీరం దాటే అవకాశముందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో గంటకు 135 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిోరా, మణిపూర్, నాగాలాండ్, అస్సోం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి ప్రభుత్వాలను వాతావరణ వాఖ హెచ్చరించింది.

ఏపీకి తప్పిన ముప్పు...
ఈ సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. చెట్లు, విద్యుత్తు స్థంభాలు నేలకొరిగే అవకాశాలున్నాయని చెప్పింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. చేపల వేట నిషిద్ధమని వార్నింగ్ ఇచ్చింది. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్ల మోస్తరు వర్షలు కురిసే అవకాశముందని చెప్పింది. తుపాను ముప్పు ఏపీకి తప్పినట్లేనని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు కూడా నిరంతరం అందుబాటులో ఉండాలని తెలిపింది. ఇప్పటికే ఏపీలోని పలు ప్రభావంతో వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


Tags:    

Similar News